బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి పరవాడ లంకెలపాలెం సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం లంకెలపాలెం పరవాడ బ్రిడ్జి పై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సమ్మె కార్మికులు వేతనాలు కోసం కాదని దేశాన్ని రక్షించడానికి కార్మిక చట్టాలను రక్షించుకోవడానికి చేసే పోరాటమని గని శెట్టి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేక చర్యలకు మోడీ సర్కార్ దిగ జారిందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలుగా మార్చే చర్య అన్నారు. అనేక దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి వాటి స్థానంలో కార్మిక హక్కుల ను అణిచివేయడానికి ఈ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందన్నారు. దీనివలన కార్మికులకు ఇఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలకు కేంద్రం బలహీన పరచడమే అన్నారు. కార్మికులకు పని గంటలు 12 గంటలకు పెంచే ప్రణాళికలు చేయడం దుర్మార్గం అన్నారు. అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను మోడీ ప్రభుత్వం ఉల్లంఘించడమే అని గని శెట్టి విమర్శించారు. పరిశ్రమల్లో పని గంటలు పెంచడం కార్మికుల ఆరోగ్యాలను నాశనం చేయడమే అవుతుంది అన్నారు. బ్రిటిష్ కాలం నుండి భారత కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించాలని కాలరాయాలని చూస్తే కార్మిక వర్గం చూస్తూ సాహించదని గని శెట్టి హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, వైయస్సార్ పార్టీలు కేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక చట్టాలు సవరించిన చట్టాలను తీసివేసిన మద్దతు పలకడం సిగ్గుచేటు అన్నారు. కార్మిక వర్గం వైపు ఉంటారా కార్పొరేట్ సంస్థలు పక్కన ఉంటారు ఈ రాజకీయ పార్టీలు తేల్చుకోవాలని గని శెట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మా కార్మికులు, ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మినీ వ్యాన్ డ్రైవర్లు,సిఐటియు నాయకులు టీ మల్లేశ్వరరావు, దేవకిషోర్, లక్ష్మణరావు, కృష్ణ, వెంకట్రావు, చిన్నారావు, రమణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరవాడ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.