వర్ధన్నపేట . సాక్షి డిజిటల్ న్యూస్ . రిపోర్టర్ కుందూరు మహేందర్ రెడ్డి. ఫిబ్రవరి 12.వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ ఆకేరు వాగు వద్ద ఉన్న తాటివనంలో కె.జి.కె.ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వ హించుకున్నారు ఈ సమావేశంలో ప్రభుత్వం రానున్న ఆర్థిక బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కెటించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్య వర్గం నిరాహారదీక్ష కు కల్లు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని గౌడ్స్ ఐక్యతను నిరూపించాలని రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి రమణ పిలుపు మేరకు తరలి రావాలని జిల్లా కార్యదర్శి మెరుగు వీరస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జనగాం యాకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి సట్ల సూరయ్య, కమిటీ డైరెక్టర్స్ కొమ్మటి కుమారస్వామి, బూర సంపత్ గౌడ్,సట్ల నర్సింహులు, మెరుగు రాజారాం, మండల సమ్మయ్య, మడ్డి రాజయ్య గౌడ్, సమ్మెట సమ్మయ్య, బాలగొని రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.