ప్రభుత్వ నిధులకు జిల్లా ఆడిటింగ్ అధికారుల తనిఖీ

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 13, ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులకు గానూ జిల్లా ఆడిటింగ్ అధికారులు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి ఆధ్వర్యంలో తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం గత రెండు సంవత్సరా లుగా అనగా 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుండి 2026 సంవత్సరం మార్చి 30వ తేదీ వరకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు గాను ఆడిటింగ్ను నిర్వహించి ఆయా పనుల లెక్కలను సరి చూసామ న్నారు. అయితే కొన్ని నిధుల కు సంబంధించి ఎం- బుక్కులు, రిసిప్టులు, ఓచర్లు లేవని, జరిగిన నిధుల పరిశీలన అంతంతమాత్రం గానే జరిగిందని కావున జిల్లా గణాంక కార్యాలయానికి లేని ఓచర్లు, యం బుక్కులు నివేదికల రిపోర్టులను జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చి ఆడిటింగ్ చేయించుకోవాలని జిల్లా ఆడిటింగ్ అధికారి రమేష్ బాబు, అడిషనల్ ఆడిటింగ్ అధికారి శేషారెడ్డి మల్లికార్జున లో స్థానిక అధికారులకు సూచించారు. అలాగే మేజర్ గ్రామపంచాయతీ హొళగుంద నందు కూడా జిల్లా ఆడిటింగ్ అధికారులు ఆయా అభివృద్ధి నిధుల రికార్డులను పరిశీలించారు. అయితే రికార్డులు అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలువది రంగమ్మ మరియు పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ లు చూయించిన ఖర్చులు నిధులు వాటి లెక్కల వివరాలు సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిటింగ్ అధికారులు, డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి, మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ స్థానిక పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.