ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతిఘటనే – యూ.టీ.ఎఫ్ నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 12 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) ఎన్నికలకు ముందు ఉద్యోగ,ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రతిఘటన తప్పదని యు.టి.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, సత్యసాయి జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు దేవరకొండ.శ్రీనివాసులు, రమావత్ .రామకృష్ణ నాయక్ హెచ్చరించారు. పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం, 29 శాతం మధ్యంతర భృతి చెల్లింపు, పెండింగ్ డీ.ఏ లు, అరియర్స్ మంజూరు, సిపిఎస్ విధానం రద్దు తదితర ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టరేట్ ఎదురుగా సమీపంలో యు.టి.ఎఫ్ తలపెట్టిన రణభేరి 2.0 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార జాతాను ప్రారంభించారు. ఈ జాతాను యు.టి.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేంద్రమ్మ, ఎస్ వి వి రమణయ్య , సత్యసాయి జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు ,రామకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ,గోరంట్ల మండలం లోని బాలుర ఉన్నత పాఠశాలలో మండల అధ్యక్షులు చాంద్బాషా ప్రధాన కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణకు కొత్త పిఆర్సి కమిషన్ ను ప్రకటించాలని ,డిమాండ్ చేశారు. 29 శాతం ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్ 4 డి.ఎలు విడుదల చేయాలన్నారు. 25 వేల కోట్ల రూపాయల మేరకు పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానంలోకి తీసుకోవాలని కోరారు. ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళి జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ కృష్ణప్పగౌరవ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ ట్రెజరర్ రామకృష్ణ సీనియర్ నాయకుడు శ్రీధర్ రావు రామాంజనేయులు క్రిష్టప్ప నరసింహులు నాగరాజు నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *