జనం న్యూస్ ఫిబ్రవరి 13 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు: గత వైసిపి ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించిచాలనే పట్టుదలతో టీడీపీ జనసేన బిజేపి పార్టీ నేతలు ఆలోచనలు వ్యూహాలు రచించి కూటమి గా ఏర్పడి ఎన్నికల్లో అత్యధికమే జార్టితో గేలుపొందారు. అయితే కూటమి ఒప్పందాలు లో భాగంగా ప్రభుత్వ నామినేట్ పదవులు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 30శాతం జనసేన పార్టీ 10శాతం బిజేపి మిగిలిన 60శాతం తేలుగుదేశం కలిసి తీసుకుని పాలన సాగించాలి.కాని అదికార తెలుగు దేశం పార్టీ నేతలు ఈ ఒప్పందం చేసుకున్న విషయం మరచి నామినేట్ పదవులు 90శాతం టిడిపి నేతలు పొందారని.జనసైనికులు బిజేపి నేతలు కార్యకర్తలు ఆరోపించారు. తాము మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని జనసేన పార్టీ నేతలు చెపుతుండగా ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యన్నారాయణ జనసేన పార్టీ విడి రాజినామా చేసి బయటకు రావడం కూడా పొత్తు ఒప్పందాలు అమలు కాకపోవడం లో భాగంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రమంతటా ఏదో ఒక చోట ప్రతి నియోజకవర్గంలో కూటమి నేతల్లో విభేదాలు ఎక్కువగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. కూటమి అగ్ర నేతలు లో సమన్వయం ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అది అమలు కాకపోవడం వల్లన ఇదే తీరు కొనసాగితే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీల అధినేతలు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో, దీన్ని బట్టి చూస్తే స్థానికంగా రావికమతం మండలం సంబంధించిన ప్రతిచోట తెదేపా అభ్యర్థులను రంగంలోకి దించే పరిస్థితి కనపడుతుంది, మరి 30% జనసేన కు ఏ పంచాయతీలో సీట్లు కేటాయిస్తారు అన్నది చూడాలి మరి బిజెపి ఏ స్థానమో కూడా చూడాలి, ప్రధాన సమస్య కొత్తకోట నుంచే మొదలవుతుంది. జనసేన నాయకులు పీవీఎస్ఎన్ రాజు కొత్తకోట పంచాయతీలో పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే తెదేపా నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు కూటమి అధినాయకత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే