జనం న్యూస్ ఫిబ్రవరి 13 ప్రతినిధి ఎండి జహంగీర్ : బిజినపల్లి మండలం పరిధిలోని పాలెం గ్రామంలో పాలెం వ్యవసాయ కళాశాల సోషల్ యాక్టివిటీ క్లబ్ ఆధ్వర్యంలో బి.ఎస్.సి (వ్యవసాయం) మూడవ సంవత్సరం విద్యార్థులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.కళాశాల ముందుగా పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములు మరియు భక్తులకు మూడు రోజుల పాటు పండ్లు,తాగునీరు మరియు అల్పాహారాన్ని పంపిణీ చేశారు.భక్తులకు ఎండలో ఉపశమనం కలిగించేలా విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈకార్యక్రమాన్ని స్వాములు,భక్తులు మరియు స్థానికులు అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అధ్యాపకులు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల సామాజిక సేవా స్పూర్తి ప్రతిఫలించింది.