వర్ధన్నపేట. సాక్షి డిజిటల్ న్యూస్. రిపోర్టర్ కుందూరు మహేందర్ రెడ్డి. ఫిబ్రవరి 13. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలబడునున్నాయి ఓట్ల లెక్కింపు కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది . ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులకు సూచనలు చేశారు .ఓట్లు లెక్కింపు కోసం నాలుగు టేబుల్ లను ఏర్పాటు చేశారు మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠత తో ఎదురుచూస్తున్నారు. గెలుపు గుర్రాలను క్యాంపుల కు తరలించడానికి ప్రధాన పార్టీల చైర్మన్ అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు.