నెట్నూరు గ్రామంలో పది లక్షలతో మహిళ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

జనం న్యూస్ 12ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. సిర్పూర్ యు మండలం నెట్నూరు గ్రామంలో పదిలక్షలతో నిర్మించే గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి నెట్నూరు సర్పంచ్ మాడవి. లక్ష్మణ్ తో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆత్రం శంకర్ పూజ చేసి ప్రారంభించారు. మండల అధ్యక్షులు ఆత్రం శంకర మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకం స్వయం సహాయక సంఘాల మహిళలకు సమావేశం నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడతాది అన్నారు. మహిళలను ఆర్థికంగా ఎదుర్కోవడానికి ప్రజా పాలన లో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు.భవన నిర్మాణ పనులు నాణ్యత పాటించాలని భవన పనులు త్వరగా పూర్తీ అయ్యేలా చూడాలని సర్పంచ్ కోరారు.