నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి

*జి.మాడుగుల ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్ద సమ్మె చేస్తున్న హమాలీ కార్మికులు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13, జి.మాడుగుల: కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోళ్లు కోడ్స్ రద్దు చేయాలని కనీస వేతనం 30వేలకు పెంచాలని ఏ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి వంతాల పండు బాబు డిమాండ్ చేశారు జి మాడుగులలో ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్ద గురువారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుమేరకు ఏ టి యు సి ఆధ్వర్యంలో జిసిసి హమాలీల నాయకులు సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను నష్టం జరిగే లేబర్ కోడ్స్ ను మోడీ సర్కార్ తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంగనవాడి ఆశ మధ్యాహ్నం భోజన పథకం వీఆర్ఏ, ఆర్సి,స్కీమ్ వర్కర్లు వంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆటో ముఠా బిల్డింగ్ వంటి అసంఘీటిత రంగాల కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్లతో కూడిన సమగ్ర చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఔట్సోర్సింగ్ టైం స్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిసిసి హమాలీ కార్మికులు కార్మిక నాయకులు సత్తిబాబు, శ్రీను,బాబురావు, సుబ్బారావు, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *