సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గ్రామీణ బంద్ నిర్వహించడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని పని జరిగే ప్రదేశంలో బంద్ చేయడం అనంతరం గ్రామ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అరూరి శ్రీను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి దాని పేరు మారుస్తూ నిధులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని మార్పు చేసింది. దీనివలన భవిష్యత్తులో నిధులు కేటాయించకుండా ఈ పథకం ఎత్తివేసే కుట్ర చేసింది దాని వలన గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం పెరుగుతుంది. గతంలో మాదిరిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు కేటాయించాలిఅదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను జాతీయ విత్తన చట్టాలను విద్యుత్ సంస్కరణను రద్దు చేసి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నెలికంటి నరసింహ దేశ బోయిన నర్సింహా నాతి వెంకటరామయ్య, పంది నరేష్, సురకంటి మోహన్ రెడ్డిఅరూరి శంబయ్య గడ్డం నర్సిరెడ్డి, ఆడెపు రమేష్, బొడ్డుపల్లి శ్రీను, అరూరి దుర్గయ్య,చిరగోని లింగయ్య, కందటి యాదిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
