దేశవ్యాప్త సమ్మెలో కదం తొక్కిన కార్మికులు.

★జాతీయ రహదారిపై రాస్తారోకో స్తంభించిన వాహనాలు. ★తిరుమలాయపాలెం సిఐటియు మండల కన్వీనర్ వషపొంగు వీరన్న.

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగినది అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామపంచాయతీ కార్మికులు వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొమ్ము శ్రీను సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు వషపొంగు వీరన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలము నుండి 29 కార్మిక చట్టాలను సాధించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలుపరచుకొనికార్మిక హక్కులను కాపాడుకుంటున్నారు దీనికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంది కార్మికులను కట్టు బానిసలుగా చేస్తా ఉంది కనీస వేతనం 26 వేల రూపాయలు ప్రభుత్వ సెక్టార్ లో పనిచేసే వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా గాని వాటిని అమలు పరచకుండా కార్మికులు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయకుంటే భవిష్యత్తులో కార్మిక లోకాన్ని కూడగట్టి భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలు జరుపుతామని వారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు జినక శ్వేత. నాగమల్లేశ్వరి. మంజుల. సుహాసిని. బేబీ. నెల్లుట్ల పుష్ప. గాయత్రి. పద్మ. మోటమర్రి నాగేంద్ర. కూరపాటి లత. దోమల సత్యవతి. మమత. జనక పోలమ్మ. తిమ్మిడి సైదమ్మ. లక్ష్మి. జిల్లా ఉప్పలయ్య. శ్రీను. గురవయ్య. రామ్మూర్తి. సుంచు ఉపేంద్ర. పద్మ. ఉప్పమ్మ భాగ్యమ్మ కోడి లింగయ్య పట్ల అంజయ్య గట్టిగుండ్ల మల్సూరు ఎస్కే మల్సూర్ మాణిక్యరావు రాము క్రాంతి కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నిరుసుల వెంకటేశ్వర్లు ఈ దేశ వ్యాప్త సమ్మెకు సంఘీభావం తెలియజేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ సిఐటియు మండల కార్యదర్శి వషపొంగు వీరన్న. అభినందనలు తెలియజేశారు.