దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్దులకు రగ్గుల పంపిణి

సాక్షి డిజిటల్ న్యూస్ సీతానగరం, ఫిబ్రవరి 13: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో 30 మంది వృద్దులకు, వికలాంగులకు రగ్గులు పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు బొంకూరి వీర వేంకయ్య, దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ఇన్చార్జ్ గిద్ద కొండయ్య పాల్గొన్నారు.