దాతల సహాయంతో సాయిబాబా ఆలయంలో పేదలకు చీరలు పంపిణీ

★ ఆలయ కమిటీ చైర్మన్ వేగి రామారావు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేయి రామారావు అనకాపల్లి ఫిబ్రవరి 13: అనకాపల్లి జిల్లా కే.కోటపాడు శ్రీ షిరిడి సాయి ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
ఆలయ కమిటీ చైర్మన్ వేగి రామారావు మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి తోడ్పాటు అందిం చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి యాల్ల సాయి, బండారు గడ్డిబాబు, మహిళా కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.