తగరపువలస లో సి.ఐ.టి.యు పిలుపుతో పారిశ్రామిక సమ్మె విజయవంతం

భీముని పట్నం, సాక్షి డిజిటల్ న్యూస్,రిపోర్టర్ (బోయి అప్పలరెడ్డి), ఫిబ్రవరి 13: దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెలో భాగంగా సిఐటియు గురువారం తగరపువలస పరిసర.ప్రాంతాలలో భీమిలి జోన్ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది సమ్మె పురస్కరించుకొని తగరపువలస జంక్షన్ లొ రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 78వ కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ.4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి.అసంఘటత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.ఆటో ముఠా క్వారీ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. సమాన పనికి సమాన వేతనాలు ప్రకటించాలిస్కీం వర్కర్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి కనీస వేతనాలు 26,000 చెల్లించాలి. పెంచిన పని గంటల విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దుచేసి విరమించుకోవాలి అన్ని రంగాలు అన్ని వర్గాలు కార్మికులకి ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలి పని భద్రత కల్పించాలి డిమాండ్ చేశారు ఈ సమ్మెలొ ముఠా.ఆటో.తోపుడు బాండ్లు. జీవీ ఎంసీ. క్వారీ. కాసర్. లోడింగ్ . అన్లోడింగ్. బిల్డింగ్. గిగ్. బ్యాంకు. సెక్యూరిటీ. భవన నిర్మాణం.ఆశ. కార్మికులు సుమారు 600 మంది పాల్గొన్నారు. భీమిలి జోన్ అధ్యక్షులు ఆర్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన. విధానాలను. మార్పు చేయక పోతే అన్ని రంగాలను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. సిఐటియు భవనం దగ్గరికి ముందుగానే కార్మికులు ఇచ్చేశారు చిట్టివలస బంతాట మైదానం నుండి కార్మికులు భారీ ఎత్తున కవాతులో పాల్గొని ఆంధ్ర బ్యాంకు. గొల్ల వీధి. పురవీధుల్లో ఎర్రజెండా రెపరెపలాడింది.తాత ధియేటర్.మెయిన్ రోడ్డు రాములమ్మ థియేటర్ .అంబేద్కర్ జంక్షన్ ప్రాంతం ఎర్ర సముద్రంగా మారింది .ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ కార్యదర్శి. ఎస్ అప్పలనాయుడు. పెన్షన్ సంఘం కార్యదర్శి బాబాజీ.నేలతి. రాము. పి. సూర్యనారాయణ. పెంట రాజు. జి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.