డి.ఎం.అండ్.హెచ్.ఓ డాక్టర్. అప్పయ్య సమస్యలతో కూడిన వినతి పత్రానీ అందజేసిన రామ రాజేష్ ఖన్నా

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, వరంగల్ రిపోర్టర్ కోర్నెలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉమ్మడి జిల్లా ఉద్యోగులందరూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాలో పాల్గొనడం జరిగింది.. ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డి ఎం అండ్ హెచ్ ఓ కు డాక్టర్ అల్లం అప్పయ్య కు అందజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… ఉద్యోగులకు రావలసిన పెండింగ్ మూడు నెలల వేతనాలు నవంబర్ , డిసెంబర్ మరియు జనవరి వేతనాలు వెంటనే విడుదల చేయాలని ,కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ,ఈ.ఎస్.ఐ., పీ.ఎఫ్. ప్రతినెల ఉద్యోగుల ఖాతాలు జమ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఉద్యోగులందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఎన్ హెచ్ ఎం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగులందరూ ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం ఆచంట అభిషేక్, ఏఐటియుసి హనుమకొండ జిల్లా లంక దాసరి అశోక్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగులు దాడి మాధవరావు, అజ్మీర విజయ నాయక్ మరియు సుమారు 50 మంది ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *