టౌన్ ప్లానింగ్ నిబంధనలు తుంగలో తొక్కిన బిల్డర్

★ఏసీపీ రామలింగేశ్వర్రావు, టీపీవో గోపన్న మౌనం ఎందుకో!!! ★అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట ఎప్పుడు? బిల్డర్ పై చర్యలు ఎక్కడ?

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, జిల్లా ఇంచార్జి, విశాఖపట్నం. పెందుర్తి జోన్, సచివాలయం 507 పరిధిలో భారీ అనధికార అక్రమ నిర్మాణం చోటుచేసుకుంది, ఈ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణ దారులు సచివాలయం వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటరీ సెక్రటరీ కొమ్మక్కయి ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ నిర్మాణం బి ఆర్ టి ఎస్ రోడ్డుకు ఆనుకొని రోడ్డు వెండింగ్లు ఉన్నది అయినప్పటికీ ఎదోచ్చిగా సగటు నిర్మాణదారుడు మరో అదనపు అంతస్తులు నిర్మాణానికి పాలు పడ్డారు ఈ నిర్మాణానికి ఎటువంటి పర్మిషన్లు లేవని స్థానిక ప్రజలు సచివాలయం సిబ్బంది చెబుతున్నారు ఈ విషయమై వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ మంగను వివరణ అడగగా ఈ నిర్మాణానికి ఎటువంటి పర్మిషన్లు లేవని మేము నోటీసులు ఇచ్చి ఉన్నామని వెల్లడించారు అయినప్పటికీ సగటు నిర్మాణదారుడు అక్రమ స్లాబ్ నిర్మాణానికి పాల్పడ్డారు. గతంలో ఈ నిర్మాణాన్ని పై చర్యలు చేపట్టిన రంధ్రాలు చేసిన తిరిగి సగటు నిర్మాణదారుడు ఈ నిర్మాణాన్ని పున ప్రారంభించారు ఈ అదనపు అంతస్తు కాకుండా మరొక అంతస్థకు కసరత్తులు కొనసాగుతున్నాయి ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఏదేచిగా సుజాతనగర్, చిన్నాముషిరివాడ, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో బి ఆర్ టి ఎస్ రోడ్డు ఆనుకొని యదేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు అందినప్పటికీ పీజిఆర్ఎస్ స్పందనలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ తుతూమంత్రా చర్యలతో నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయం సిబ్బంది వదిలేస్తున్నారు . ఇలా జరగడానికి కారణం సచివాలయం సిబ్బందికి టౌన్ ప్లానింగ్ అధికారులకి లంచాలే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు అలాగే ఇటువంటి నిర్మాణాలు వల్ల జీవీఎంసీ ఆదాయానికి గండికోడుతూ ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తున్న నిర్మాణదారులపై వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇటువంటి నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులపై సచివాలయం సిబ్బందిపై తక్షణమే చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గారిగ్ ను ప్రజలు కోరుకుంటున్నారు.