సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 13, టిడిపి పార్టీ బలోపేతం కోసం కిందిస్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు ఈ సందర్భంగా గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యదర్శులతో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కేడర్ బలోపేతం, కార్యకర్తల పాత్ర మరియు బాధ్యతలపై దిశా నిర్దేశం చెస్తు . టీడీపీ క్యాడర్ కేర్ ట్రైనింగ్ మాడ్యూల్ గురించి వివరిస్తూ, తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు కేవలం అసెంబ్లీల్లో గెలుపు కోసం మాత్రమే కాదని, కార్యకర్తల నమ్మకం, నిబద్ధత, వారు ప్రతిరోజూ చేసే సేవల మీదే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇతర పార్టీల్లో కార్యకర్తలను ఎన్నికల సమయంలో ఉపయోగించుకుని తర్వాత గాలికి వదిలేస్తారని, కానీ టీడీపీ దృష్టిలో కార్యకర్తలే అధినేత అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ మహత్తర ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుండగా,మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చొరవతో పార్టీకి మరింత బలం చేకూరుతోందని పేర్కొన్నారు అనంతరం ఈ బిజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు మంగళగిరి కి వెళ్లడం జరిగిందని వారు తెలిపారు.
