జాతరకు ముస్తాబు అవుతున్న విశ్వేశ్వరాలయం

జనం న్యూస్ ఫిబ్రవరి 12 సిద్దిపేట రూరల్ రిపోర్టర్ జోగారి రాకేష్ : ఈనెల 14వ తేదీ నుండి 17 వరకు మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి ఆలయంలో 16వ వార్షికోత్సవంతో పాటు, మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాల ఏర్పాట్లతో జాతరకు ముస్తాబు అవుతుందని అలాగే ఆలయం ముందు అఖండ దీపం ఏర్పాటు చేస్తాం అని ఆలయ అర్చకులు నల్లాన్ చక్రవర్తులు వేణుగోపాలాచార్య తెలిపారు.ఈ ఉత్సవాలకు గ్రామ సర్పంచ్ కుంచం లతా వెంకట్, పాలక వర్గం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలలో భాగంగా 14వ తేదీ శుద్ధి పుణ్యహవచనం, 15 న రుద్రాభిషేకం, శివాభిషేకాలతో పాటు అఖండ దీపం, కళాప్రసాద్ బృందంతో జాన పద సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తమండలిచే భజన కార్యక్రమం, రాత్రి 12:00 గం॥లకు లింగోద్భవం ఆరగింపు, 16న శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం, స్వామి వారి పల్లకి సేవా ఉరేంగింపు కార్యక్రమాలు, 17 న శత షు భిషేకం నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరు కావాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *