చిలుక నగర్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చేరియల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి 79 వ జయంతి వేడుకలు..

*రాజన్న ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేద్దాం చేరియల శ్రీనివాస్….

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కీ:శే:లు బండారి రాజిరెడ్డి 79 వ జయంతి ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గం చిలకనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చేరియల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా బండారి రాజిరెడ్డి కుమారుడు బండారి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి 79 వ జయంతి వేడుకలు జరిగాయి పార్టీలకు అతీతంగా అభిమానులు శ్రేయోభిలాషులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాలలు అర్పించారు అధ్యక్షులు చేరియల శ్రీనివాస్ మాట్లాడుతూ కీ:శే : రాజిరెడ్డి గతములో మున్సిపల్ చైర్మన్ గా, ఉప్పల్ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే గా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబెర్ గా వివిధ సేవలు అందించిన గొప్ప నాయకుడు అని, పీడిత , బాధిత ప్రజలకు ఎన్నో సేవలు అందించి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు అని తను చేసిన సేవలు గుర్తుచేసుకోవడం గొప్ప విషయం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, జెల్లీ మోహన్, మాస శేఖర్, రవీందర్ గౌడ్, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *