ఘనంగా మాధవరం-1లో గజ్జ పూజ వేడుకలు

★అలరించిన కోలాటం భజన ప్రదర్శన

సాక్షి డిజిటల్ న్యూస్ సిద్దవటం ఫిబ్రవరి 13 వైయస్సార్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ( పాటూరు శ్రీనివాసులు రెడ్డి ) సిద్దవటం మండలం లోని మాధవరం-1 గ్రామంలో బుధవారం రాత్రి గజ్జపూజ వేడుకలను గ్రామ పెద్దలు, నిర్వాహకులు పాటూరు శ్రీనివాసులరెడ్డి, కిరణ్ కోలాట బృందం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గోపవరంకు చెందిన కోలాటం మాస్టర్ (గురువు)నల్లపోగు కిరణ్ గ్రామం లోని మహిళలకు, చిన్నారులకు మూడు నెలల పాటు కోలాటం భజనలు నేర్పించి గ్రామ పెద్దల సమక్షంలో గజపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కోలాటం భజనలు చూపరులను ఎంతగానో అలరించాయి. గజ్జపూజ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొనగా వచ్చిన వారికి నిర్వాహకులు అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.