సాక్షి డిజిటల్ న్యూస్ త్రిపురాంతకం గొట్టిముక్కల యోహాన్ విలేకరి ఫిబ్రవరి 14, గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన మంచాల స్టీవెన్ రాజ్ – విజయ వివాహ సందర్భంగా వధూవరులకు మార్కాపురం జిల్లా మాల ఉద్యోగులు జేఏసీ మరియు మాలలు జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికూతురు విజయ ఇటీవల విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. విద్య, కృషితో సాధించిన ఈ విజయాన్ని పలువురు నాయకులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా మాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు జి. శామ్యూల్ రాజ్, పి. కృపా రక్షణ, పల్లె పౌలు ప్రతాప్, మాలలు జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంచా సాయి, జిల్లా జాయింట్ సెక్రటరీ పరదేశి శ్రీనివాసులు, యామ శంకర్, గిద్దలూరు మండల అధ్యక్షులు టెంట్ హౌస్ దాసు, జి. సంగీతరావు, ఎస్. వరప్రసాద్, ఎం. సురేష్, గుల్ల ఓబులు, ఎం. చెంచయ్య, ఎం. అబ్రహం, బి. కృష్ణ, సిహెచ్. రాబర్ట్, ఎస్. చంద్రశేఖర్, అమడాల బాబు, సిహెచ్. శ్రీనివాసులు, డి. సంగీతరావు, ఏం. సురేష్ తదితరులు పాల్గొన్నారు.