గోదావరి బ్యాక్ వాటర్ పెరిగింది ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారు.

దేవీపట్నం సాక్షి డిజిటల్ న్యూస్: ప్రతినిధి కే. ప్రకాశరావు, పోలవరం బ్యాక్‌వాటర్ పెరుగుదల, గొందూరు గండి పోచమ్మ ఆలయాన్ని తాకిన వరద నీరు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ స్థాయి క్రమంగా పెరుగుతూ గండి పోచమ్మ ఆలయాన్ని తాకింది. పెరుగుతున్న వరద ముప్పు నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా, ఎవరూ ఆలయానికి రావద్దని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆకుల లక్ష్మీ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అధికారులు నిరంతర పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. నీటి మట్టం తగ్గిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *