గుణదల మేరీమాతను దర్శించుకున్న మదిర టౌన్ జనం న్యూస్ రిపోర్టర్ కుటుంబం.

జనం న్యూస్ ఫిబ్రవరి 12 మధిర టౌన్ ప్రతినిధి నండ్రు సుందర్ రావు : విజయవాడ పట్టణంలోనే గుణదల గుట్ట మీద దర్శనమిచ్చిన మేరీ మాత పండుగను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 10 11 తేదీలలో జరుపుకోవటం అనేది సాంప్రదాయం ఈ గుణదల మాత మహోత్సవానికి దేశం నలుమూలల నుండి కోకొల్లలుగా వచ్చి మేరీమాతను దర్శించుకుని వారు చేసుకున్న మ్రొక్కుబడులను చెల్లించి మేరీ మాత ఆశీస్సులు తీసుకుని వెళ్లడం అనేది ఆనవాయితీ అదే విధంగా ఎంతో మంది భక్తులు మేరీ మాతను దర్శించి తమ అవసరాలు నిమిత్తం మేరీ మాతకు విన్నవించుకొని తమ కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటారు ఆ ప్రార్థనలు నెరవేరిన ఎడల మరల రానున్న సంవత్సరంలో జరిగే గుణదల మేరీ మాత మహోత్సవంలో పాల్గొని మరొక మ్రొక్కుబడులుచెల్లించుకుంటారు దానిలో భాగంగానే ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన జనం న్యూస్ మధిర టౌన్ రిపోర్టర్ అయినా నండ్రు సుందర్ రావు జ్యోతి కోమలి సుప్రజ కుటుంబం మేరీమాతను దర్శించుకునీ ప్రార్థించుకున్నారు అలాగే మదర్ తెరిసా చెప్పినట్లుగా మనకోసం ప్రార్థించటం కాకుండా ఇతరుల అవసరాల కోసం ప్రార్థించండి అనీ తెలియజేసిన మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకొని నండ్రు సుందర్ రావు కుటుంబం ఇతరుల అవసరాల కోసం ఇతరుల కుటుంబాల కోసం ప్రార్థించి ఆ తల్లి దీవెనలు ప్రతి కుటుంబం పైన నూరంతలుగాను ఆరువదంతలు గాను మెండుగా ఉండాలని దీవెనలు మెండుగా కురిపించాలని ఆ తల్లిని ప్రార్థించారు ఆ తర్వాత ఆ తల్లికి నారికేళం సమర్పించి చర్చిలో ప్రార్థించుకొని దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులను సమస్త మానవాళిని సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో కాచి కాపాడమని జనం న్యూస్ రిపోర్టర్ అయినా నండ్రు సుందర్ రావు కుటుంబం ప్రార్థించి తల్లి దీవెనలు కోసం ప్రార్థించారు వీరితోపాటు పింగళి బాబురావు సుజాత కుటుంబం కూడా మేరీమాతను దర్శించుకుని మ్రొక్కుబడులు చెల్లించుకుని ఆ తల్లి దీవెనలు వారి కుటుంబం పైన హేరాళముగా ఉండాలని తల్లిని ప్రార్థించుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *