సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 2026 రిపోర్టర్ రాజు జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాలలో న నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమై, కార్మిక వ్యతిరేక విధానాలతో చట్టాలను అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల ఉపాధి, భద్రత, జీవనాధారాలను దెబ్బతీసేలా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, ఉపాధి హామీ కూలీలకు నష్టం కలిగించే వి.బి. రామ్ చట్టం, రైతు వ్యతిరేక జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
