కోటలో అంగన్వాడి వర్కర్ల ధర్నా

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ ను రద్దుచేసి కనీస వేతనం పెంచాలంటూ కోట మండలం అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ గురువారం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో భాగంగా అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతూ నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. 50 సంవత్సరాలు పూర్తి తీసుకున్న ఐసిడిఎస్ సరైన మౌలిక సదుపాలయాలు కల్పించాలన్నారు . అంగన్వాడి వర్కర్లను గ్రేడ్ 3, ద గ్రేడ్ 4 హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అంగన్వాడీ వర్కర్లకు 26000 కనీస వేతనం మరియు 10,000 పెన్షన్ చెల్లించాలని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐన అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటి చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండలంలోని అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.