కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాలు రద్దుకు నిరసన సెగ

★కార్మిక చట్టం (నాలుగు జీ ఓ లు) రద్దు నిలుపుదల చేయాలని★ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి పండు బాబు డిమాండ్

జనం న్యూస్ ఫిబ్రవరి 12 జి.మాడుగుల విలేకరి కృష్ణబాబు : అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలోని జి.సిసి హమాలీల సంఘం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి, పండు బాబు పిలుపుమేరకు పలు కార్మిక సంఘాల కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐటియుసి జిల్లా ప్రధాన అధ్యక్షులు వి, పండు బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టం పై నాలుగు జీవోలు రద్దుకు పిలుపునిచ్చాయో ఆమోదం తెలిపిందో అవి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్మిక చట్టంలోని కీలకమైన నాలుగు జీవులు రద్దు చేయడం విచారకరమని కార్మికుడు దేశానికి వెన్నెముక అంటూనే అటువంటి కార్మికుల పొట్ట కొట్టే విధంగా కార్మిక చట్టం తీసుకురావడం చాలా విచారకరమని ఆయన మండిపడ్డారు ఒకవైపు కార్మిక సంఘాల చుట్టూ తిరుగుతూనే కార్మికుల పొట్ట కొట్టే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని కార్మికుల పొట్ట కొట్టడం చాలా బాధాకరమని ఆయన మండిపడ్డారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే కార్మికుల పొట్ట కొట్టే విధంగా చట్టాలు అమలు చేస్తున్నాయో దాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే నిరసన ఉదృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి హమాలీలు కార్మిక సంఘాలు తదితరులు పాల్గొన్నారు.