కాల్వల పూడికలను వెంటనే ప్రారంభించాలి

జనం న్యూస్ 12 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా విష్ణువర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం ఏలుకూరు గ్రామం. లో నీరు పొలాల్లో వృధాగా పారుతున్న వైనం. కాలువల పక్కన ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్కూర్ గ్రామ సహయ కార్యదర్శి గొంగడి వెంకటేష్ డిమాండ్. కాలువలలో గడ్డి జమ్మూ మట్టి పేర్కొనిపోవడం వల్ల నీరు ముందుకు వెళ్లలేక ఇలా కాలువల నుండి కాలువ మీద ఎక్కి పారుతున్నాయి. ఇలా పారడం వల్ల కాల్వపక్కన ఉన్న రైతు తీవ్ర నష్టానికి గురవుతున్నాడు. అటు పంట వేసినా ఇలా నీరు పారడం వల్ల పంట నష్టపోతున్నాడు, ఒకవేళ పంట వేయ కుండా ఆ పొలాన్ని బీడు పెట్టిన వచ్చే సంవత్సరం ఆ పొలం పంట పండదు. ఒకపక్క నీరు కింది పొలాల రైతులకు అందకపోవడం, ఒకపక్క నీరు ఎక్కి పారడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కావున ప్రభుత్వ అధికారులు రేపు ఎండాకాలంలో కాల్వపూడిక పనులను వెంటనే ప్రారంభించాలి. లేనియెడల రైతులు చాలా నష్టాల పాలవుతారని ఈ సందర్భంగా ఎల్కూరు గ్రామ భారత కమ్యూనిస్టు పార్టీ. సి పి ఐ సహయ కార్యదర్శి గొంగడి వెంకటేష్ తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *