జనం న్యూస్ ఫిబ్రవరి 12 భూపాలపల్లి ( చిట్యాల) ప్రతినిధి శ్రీనివాస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెలో ఏఐఎఫ్ టు యు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మరియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాయమల్లు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని విదేశీ కార్పొరేట్ సంస్థల పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను లేబర్ కోడ్ ల ను అమలు చేయమని కేరళ ఢిల్లీ పశ్చిమబెంగాల్ తమిళనాడు వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అదే క్రమంలో ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అని హామీలు ఇచ్చి గెలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఇతర రాష్ట్రాల విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో స్వచ్ఛంగా పాల్గొన్న సంఘటిత అసంఘటిత కార్మిక వర్గాలకు విప్లవ జేజేలు తెలుపుతూ ఇదే స్ఫూర్తితో సింగరేణి పరిరక్షించుకునే విధంగా నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేసేంతవరకు 29 కార్మిక చట్టాలను అమలు చేసేవరకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని బిజెపి మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలు కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని కార్మికులను నిరాయుధలను చేసి పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా చట్టాలను మార్పుతో భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ మార్చే విధంగా కొనసాగిస్తూ మనుధర్మ – ఆర్ఎస్ఎస్ భావజాలాలను పెంపొందిస్తూ విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ ల ను తీసుకొని వస్తుందని కార్మిక చట్టాలను లేబర్ కోడ్ ల ను రద్దు చేసే వరకు పోరాటం చేయాలని సింగరేణి బొగ్గు బ్లాక్ లను సింగరేణికి వేలం లేకుండా ఇవ్వాలని ఓసిపిలను రద్దుచేసి నూతన భూగర్భ గనుల నిర్మాణం చేపట్టాలని సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని కార్మికులపై పని భారం తగ్గించాలని అపరిస్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పరిష్కారం అయ్యేంతవరకు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మికుల ప్రజా రైతుల సమస్యలు పరిష్కరించబడతాయని వారు మాట్లాడారు