కార్మిక చట్టాలు నిర్వేర్యానికి మోడీ సర్కార్ కుట్ర

★జి.మాడుగులలో కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సమ్మె కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్న పడాల్

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13, జి.మడుగుల: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో
జి మాడుగుల మండల కేంద్రంలో రామాలయం వీధి నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరాశన తెలియజేయడం జరిగింది. అనంతరం తాసిల్దార్ కార్యాలయం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు మండల ఉపాధ్యక్షులు మత్స్యలింగం అధ్యక్షత వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మన్నపడాల్ మాట్లాడుతూ
నరేంద్ర మోడీ ప్రభుత్వం29 కార్మిక చట్టాలు రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉక్కుపాదంతో అణిచివేస్తున్నదని కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేయడానికి చట్టం అడ్డు తొలగించుకోవడానికి పథకం పేరుతో ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఉపాధి హామీకి ఇచ్చేవారని ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం 60 శాతం నిధులు మాత్రమే కేంద్రం విడుదల చేస్తుందని 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని తీసుకువచ్చిన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మికుల హక్కులు చట్టాలు రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆదివాసీ 5 షెడ్యూల్ ఏరియాలో 100 శాతం రిజర్వేషన్ చట్టం చేసి ఆదివాసి జాబ్ కేలండర్ ప్రకటించి ఆదివాసీ లకు ప్రత్యేక డిఎస్సి అమలు చేసి ఆదివాసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ, ఆశా, మిడ్డమిల్స్, వీఓఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని 12 గంటలు పని దినం రద్దు చేయాలని 8 గంటల పని దినాలు కొనసాగించి నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల ఈ ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వివో ఏల సంఘం నాయకులు దేవి నాయుడు అంగన్వాడి యూనియన్ అధ్యక్షురాలు మోదకొండమ్మ వరలమ్మ రాజేశ్వరి ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు ఈశ్వరమ్మ పూజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.