కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు రద్దుకై

సాక్షి డిజిటల్ న్యూస్ డిండి ( గోరటి సాయికుమార్ డిండి ప్రతినిధి) ఫిబ్రవరి 12 సమ్మె జయప్రదం చేయండి.
ఏఐటియుసి కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు రద్దుకై ఫిబ్రవరి 12 సమ్మె దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె చంప మీద కొట్టినట్టుగా జరిగిందని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కామ్రేడ్ ఎండీ మైనుద్దీన్ డిమాండ్ చేశారు. కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే విధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా గురించి కార్మికులపై నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను ఎత్తివేయాలని కార్మికులపై మోపుతున్న పెనుబారాన్ని తగ్గించకపోతే నరేంద్ర మోడీ గద్దె తీయవలసిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారికార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిత్యం పోరాటాలలో భారత కమ్యూనిస్టు పార్టీ ముందు వరుసలో నిలబడుతుందని ఆయన ఇచ్చిన హామీ ఇచ్చారు పార్టీ భరోసా కల్పిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడచిన శతాబ్ద కాలంలో ఏఐటీయుసీ నాయకత్వంలో భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలు చేసి 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికుల సంఘ హక్కు, సమ్మె హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. స్వతంత్రం వచ్చినప్పటినుండి కార్మికుల ప్రజల త్యాగాలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదను అదాని అంబానీ లాంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకు కారుచౌకగా దోచిబెడుతున్నారు దేశం అప్పు 58 లక్షల కోట్ల నుండి 214 లక్షలకు పెరిగిందని. పేద ప్రజలపై భారం మోపి లక్షల కోట్ల రూపాయలు సంపన్నులకు రాయితీలు ఇస్తున్నారు. పర్మనెంట్ విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంతో ఉద్యోగులను కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ఎల్ఐసి బ్యాంకులు తదితర రంగాలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నారు
ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని అంగన్వాడి మధ్యాహ్న భోజన ఆశా భవన నిర్మాణ రంగం స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రు 26,000 అమలు చేయాలని కనీస పెన్షన్ నెలకు 9000 రూపాయలు ఇవ్వాలని రద్దుచేసి కార్మిక న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియూ సి మండల అధ్యక్షులు భు ష్పక లింగమయ్యఏఐటీయూసీ డివిజన్ నాయకులు కంపల్లి ప్రేమయ్య ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు యనమల నవీన్ గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రామావత్ జోహార్ లాలు భవానిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎలిమినేటి దేవయ్య మండల ఉపాధ్యక్షులు వేముల ప్రవీణ్ నాగిళ్ల సహదేవ్ గంగమ్మ లక్ష్మమ్మ సాలమ్మ లాబాను దావీద్ పంత్య వెంకటయ్య మద్దెల పర్వతాలు కడారి తిరుపతయ్య మధ్యల లింగమ్మ నాగార్జున జగతయ్య జంగయ్య పారమేష్ భారతి సుజాత తదితరులు పాల్గొన్నారు.