కబ్జా కొరల్లో కొండాపూర్ భూములు

★అన్యాక్రాంతమైన 28 ఎకరాల పత్తరాకుంట. ★కనుమరుగైన 4 ఎకరాల గైని గుట్ట కొండలు. ★ కబ్జా కొరల్లో 12 ఎకరాల ఊర చెరువు.

జనం న్యూస్ 13 ఫిబ్రవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా : రుద్రూర్ మండలం కొందాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములు, కుంట,చెరువు అన్యాక్రాంతమవుతున్న సంబంధించిన రెవిన్యూ అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎంక్వైరీల పేరుతో కాలం వెలదీస్తున్నారే తప్ప ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సర్వే నెంబరు 219లో ఊర చెరువు 42 ఎకరాల 18 గుంటలు ఉండగా సుమారు 12 ఎకరాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో కనుమరుగైపోయిందని గ్రామస్తులు తెలియ జేస్తున్నారు. సర్వేనెంబర్ 103లో పత్తరాకుంట 28 ఎకరాల 15 గుంటల భూమి అన్యాక్రాంతమైపోయి గుంట భూమి లేకుండా కబ్జాదారులు మొత్తం కుంటానే మాయం చేశారు. సర్వే నంబర్ 141,142,143లోసుమారు 4 ఎకరాలు గైని గుట్ట కొండలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో కనుమరుగైపోయాయి. సర్వే నెంబర్ 309 లో 12 ఎకరాలు గతంలో ప్రభుత్వం పేద ప్రజల కోసం భూములు పంపిణీ చేసి పట్టాలి ఇచ్చిన కబ్జాదారులు కబ్జా చేసుకొని యాదేచ్చగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వ రికార్డులలో లబ్ధిదారుల కనిపిస్తున్న వారి వద్ద కేవలం పంపిణీ పత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలను చెరువు ప్రాంతంలోని బురదలో పూడ్చాల్సిన దుస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కనీసం దాహన సంస్కారాల కోసం కూడా గుంట భూమిని సైతం మిగిల్చకుండా ప్రభుత్వ భూములు పై కబ్జాదారులు గద్దల్ల వాలిపోయి కబ్జాలు చేసుకున్నారు.ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగనికి ఉలుకు పలుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారే తప్ప కబ్జాదారుల పై చర్యలు తీసుకోవడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వ అధికారులు మారిన ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించడం లేదు. పాలకులు కనికరించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినప్పుడల్లా విచారణ పేరుతో కాలయాపన చేస్తూనే వస్తున్నారు. ఇంత జరుగుతున్న కొందాపూర్ ప్రజల తరఫున గోంతెత్తె నాయకుడే లేడు నూతనంగా ఏర్పడ్డ గ్రామపంచాయతీ తొలి సర్పంచ్ గోంటి సాయిలు కుందాపూర్ సమస్యల పైన తన పోరాటాన్ని ప్రారంభిస్తానని అన్నారు.