ఒక చిప్స్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి

జనం న్యూస్ 12 ఫిబ్రవరి 2026. జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : చిప్స్ తినటానికి కంటే ముందు కొనటానికి ఆలోచించండి ,ఎందుకంటే చిప్స్ ఎప్పుడో ఒకసారి తీసుకొని తినడం మంచిదే, కానీ దాన్ని రోజు అదే అలవాటుగా తింటే పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం.రోజు చిప్స్ పెద్దలకంటే పిల్లలే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, పిల్లలు ఎప్పుడో ఒకసారి చిప్స్ ప్యాకెట్ ని తీసుకోవడంలో ఎలాంటి నష్టం జరగకపోవచ్చు కానీ రోజు అదే అలవాటుగా మనము చిప్స్ ప్యాకెట్ ని పిల్లలకు ఇస్తూ ఉన్నాము అంటే, దాని యొక్క ప్రభావము ఈ రోజుకి ఏమి కనిపించకపోవచ్చు ,కానీ దాని నుండే జరిగిన నష్టము మన గుండె దాకా తీసుకెళ్తుంది అనే విషయాన్ని తల్లితండ్రులు గమనించలేక పోతున్నారు చాలా మంది పిల్లలు స్కూల్ కి లంచ్ బాక్స్ లో స్నాక్స్ కి కొన్ని చిప్స్ తీసుకెళ్తూ ఉంటారు మరి కొంతమంది స్కూల్ నుంచి రాగానే అనే చిప్స్ ప్యాకెట్స్ లాంటివి స్నాక్స్ కూడా తెచ్చుకొని తింటూ ఉంటారు. చిప్స్ విషయంలో జాగ్రత్త అవసరం ఎందుకంటే ఎక్కువగా నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. ఈ అధిక నూనె శరీరం లో చెడు కొవ్వును పెంచి, దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అంతే కాకుండా చిప్స్‌లో ఉప్పు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ పెరిగి, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిప్స్ తినడం ఒక అలవాటుగా మారి పోతుంది. మొదట చిన్న ప్యాకెట్‌తో మొదలై, తరువాత రోజూ తినే అలవాటుగా మారుతుంది. ఇలా తెలియకుండానే ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది.మరి అలవాటుని ఎలా దూరం చేయాలి ? తల్లితండ్రులుగా మనం రోజు ఇచ్చే కొన్ని రకాల జంక్ ఫుడ్ పిల్లల ఆకలి తీర్చడానికి మాత్రమే అనుకుంటాము కానీ ఈ ఆకలి తీర్చడం అనేది ఒక అలవాటుగా మారి అది క్రమంగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నట్లుగా ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ మెదడులో ఆనందాన్ని కలిగించే వ్యవస్థను ప్రభావితం చేసి మరింత తినాలనే కోరికను పెంచుతాయి, వెంటనే జంక్ ఫుడ్ ఆపేయమని బలవంతం చేయకుండా, ప్రతిరోజూ కొంచెం సమయం కేటాయించి ఇంట్లో చేసిన ఆరోగ్య కరమైన ఆహారానికి అలవాటు చేయండి, ఎందుకంటే చిన్న చిన్న మార్పులే వారి జీవితాంతం ఆరోగ్యాన్ని కాపాడే పెద్ద నిర్ణయాలవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *