జనం న్యూస్ ఫిబ్రవరి 13 ఎలిగేడు మండలం : గురువారం రోజున దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటు సమ్మెను నిర్వహించి ఎమ్మార్వో యాకన్న కు వివిధ కార్మిక సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికులకు న్యాయం జరుగడం లేదు అన్నారు. ఈ కార్యక్రమములో కె వి పి ఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నవీన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇరుగురాల లచ్చయ్య, మండలం ప్రెసిడెంట్ తీట్లశ్రీనివాస్, కార్మిక సభ్యులు దేవేందర్, రమేష్ లక్ష్మన్ ,కొండయ్య, రవీందర్, చంద్రయ్య, అంగన్వాడి టీచర్లు ,ఆశా వర్కర్లు , హమాలి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు