సాక్షి డిజిటల్ న్యూస్: 13 ఫిబ్రవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించ కూడదని ఆయన వెల్లడించారు.