ఎన్టీఆర్ భరోసా పేదలకు భరోసా

★టిడిపి రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి హరి ప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్ సిద్ధవటం ఫిబ్రవరి 12 వైయస్సార్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ( పాటూరు శ్రీనివాసులు రెడ్డి ) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్టీఆర్ భరోసా ద్వారా అనారోగ్యాలతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం లో నిరుపేద కుటుంబాలకు ఒక భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టడం శుభ పరిమాణమని టిడిపి రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఉప్పరపల్లి పల్లె గ్రామంలో గురువారం మాట్లాడుతూ ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతూ వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టుకున్న కుటుంబాలకు ఆసరాగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక భరోసా కల్పించామని ఒంటిమిట్ట మండలంలోని నరసన గారి పల్లె చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి అనారోగ్యాలతో ఎన్నో ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుందని వారి కుటుంబానికి భరోసాగా2,31,480,00 రూ, చెక్కు అందించామని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చెప్పిన వాగ్దాన ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజర్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.