ఎంఎస్ఎంఇ మరియు జెఎన్టియు తొ బెహరా ఒప్పందం

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, జిల్లా ఇంచార్జి, విశాఖపట్నం నరవ…. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఇ ఎస్ డి పి) భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎం ఎస్ ఎం ఇ) ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థతో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ గురజాడ విజయనగరం వారితో బెహరా ఇంజనీరింగ్ కళాశాల ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని బెహరా విద్యాసంస్థల సెక్రటరీ డా. బెహరా చైతన్య ఆనందం వ్యక్తం చేసారు. బెహరా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 20 రోజుల నైపుణ్య మరియు పారిశ్రామిక అభివృద్ధి శిక్షణా కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభం కానుందని, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం మరియు పారిశ్రామిక నైపుణ్యాలను అందించి వారిని సాధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కళాశాల ముందుకు వెళుతుందని ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డా. శ్రీధర్ పట్నాయక్ అన్నారు. జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం ద్వారా ఈ శిక్షణా కార్యక్రమం అమలు చేయబడుతోందని తెలిపారు. శిక్షణలో పాల్గొనేవారికి ప్రాక్టికల్ శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం మరియు పారిశ్రామిక దృక్పథంతో కూడిన అభ్యాసం అందించబడుతుందని, ఇది వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా స్వయం ఉపాధి సామర్థ్యాలను కూడా పెంపొందిస్తుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 17 ఫిబ్రవరి 2026 నుండి బెహరా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో ప్రారంభమవుతుందని, విద్యార్థులు తమ పేర్లను కళాశాలలో ముందుగా నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ నైపుణ్యాలు మరియు పారిశ్రామిక ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి నారాయణ, ఫ్యాకల్టీ లు రక్షిత్ కుమార్ పాండే, మహేష్, కుప్పిలి గణేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *