ఇరువైపులా రోడ్డు కు పిచ్చి మొక్కలను తొలగించిన సర్పంచ్.

(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్ పల్లి) ఫిబ్రవరి 13, మెట్పల్లి మండలం లోని వేంపేట్ గ్రామం లో రోడ్డు కు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ తో తీసివేయించి చదును చేయించడం జరిగింది. అలాగే రోడ్డు ప్రక్కన చాలా లోతుగా ఉన్న ప్రాంతంలో వాహనాలు అదుపు తప్పకుండా ఉండటానికి మొరం తో చదును చేయించడం జరుగుతుంది. ఇట్టి పనులు పరిశీలించడానికి మెట్ పల్లి ఎంపీడీఓ సురేష్ రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వేంపేట్ గ్రామ సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్ది, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు మెంబర్ గోరుమంతుల రఘు లు ఉన్నారు.