ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి:13 కామారెడ్డి జిల్లా ప్రతినిధి, పిట్ల.అనిల్ కుమార్, భిక్కనూరు మండల కేంద్రంలోని ఇసనపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని నూతన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా మండల కేంద్రానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగింది మరియు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏన్నో పథకాలు పెట్టడం జరిగింది మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు ఉచిత కరెంటు బతుకమ్మ చీరలు రైతులకు సమయానికి ఫర్టిలైజర్స్ చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని వారు గుర్తు చేశారు మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవారు ప్రతి ఒక్కరు సభ్యునిగా చేసుకోవాలని తొందర తొందరగా పూర్తి చేసుకుంటే తొందరగా బిల్లులు వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు నన్ను ఈ నూతన గ్రహీతనన్ను ఈ నూతన గృహ ప్రవేశాని ప్రవేశానికి ఆహ్వానించిన ఇస్సనపల్లి గ్రామస్తులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *