ఇందిరమ్మ ఇంటి స్లాబ్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిబ్రవరి 13 రిపోర్టర్ షేక్ సమీర్ వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలంలో గుండెపుడి గ్రామం నందు ఇందిరమ్మ గృహ లబ్ధిదారుడు మధ్యబోయిన సావిత్రి వెంకటేశ్వర్లు తన ఇంటి స్లాబ్ కార్యక్రమం ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు కంచర్ల హరీష్ స్థానిక నాయకులు ఇందిరమ్మ కమిటీ చైర్మన్ ఎండపల్లి చిట్టిబాబు ఇద్దరు కలిసి పూజ కార్యక్రమం లో పాల్గొని స్లాబ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా కంచర్ల హరీష్ మాట్లాడుతూ మొదట లబ్ధిదారుడికి అభినందనలు తెలిపారు. నెల రోజులలోనే స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేసిన మేస్త్రి కి అభినందనలు తెలిపి, ఇప్పటివరకు 2బిల్స్ అంటే 2లక్షల రూపాయలు లబ్ధిదారుడి ఖాతాలో పడటం అంటే ఇది రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. మండలం లో ఇందిరమ్మ గృహ లబ్దిదారులందరు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఫోటో అప్లోడ్ మూడు రోజులకి డబ్బులు రావడం పట్ల లబ్దిదారుల చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ గృహ లబ్దిదారులు నిర్మాణంలో ఎమైన సమస్యలు ఉంటే ఇందిరమ్మ కమిటీ దృష్టికి తేవాలని, బిల్లుల విషయంలో కూడా ఎమైన సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. ఇందిరమ్మ గృహల విషయంలో ఎవరికి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వవలిసిన అవసరం లేదని, ఎవరైనా అడిగితే తమ దృష్టికి తేవాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో అందరికి ఇందిరమ్మ గృహాలు వస్తాయని, ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ సహకారంతో పూరి గుడిసె లేకుండా చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తానని కంచర్ల హరీష్ అన్నారు. అందరు ఓపిక తో ఉండండి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు వచ్చే విధంగా పని చేద్దామని అన్నారు. ప్రజలందరు ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. అక్కడ అక్కడ ఎవరో ఒకరు గందరగోళం చేస్తారు వాళ్ళని పట్టించుకోవద్దని అన్నారు.చివరిగా లబ్ధిదారులు అందరు త్వరగా పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గాదె కృష్ణయ్య . గ్రామ పెద్దలు కాలూరి వెంకటేశ్వరరావు భూక్యా నరసింహారావు. మద్యబోయిన మహేష్ పిచ్చారావు. బాదావత్ నాగేశ్వరరావు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.