ఆలేరు సమ్మెలో పాల్గొన్న కార్మికులు; రాచకొండ జనార్ధన్

జనం న్యూస్ 13 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం నుండి వ్యవసాయ మార్కెట్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ముందు సభ నిర్వహించారు అనంతరం ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచకొండ జనార్ధన్ నాయకులు మామిడల బిక్షపతి కేమిడి ఉప్పలయ్య కళ్లేపు అడవయ్య చెక్క వెంకటేష్ లు పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని యాజమాన్యాల ముందు కట్టు బానిసలుగా చేసే నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను ఉపసంహరించు కోకుంటే బీ జే పీ పతనం తప్పదనీ బీజేపీ మోడీ ప్రభుత్వాన్నిహెచ్చరించారు. మోదీ బీ జే పీ ప్రభుత్వం అనుసరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం కు అనుకూలంగా, దేశ ప్రజల ను, రైతులను దివాలా తీయించే వాణిజ్య ఒప్పందం, ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ ల అమలును ఉపసంహరించుకోవాలని, విత్తన, విద్యుత్ సవరణ, వి బి జీ రామ్ జీ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఐ ఎఫ్ టి యు, ఏ ఐ టి యు సీ, ఎస్ కే ఎం ల ఆధ్వర్యంలో ఆలేరు లో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఐ ఎఫ్ టి యు, ఏ ఐ టి యు సీ, ఏ ఐ కే ఎం ఎస్,రైతు. కూలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *