జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం. 12/02/2026 : పుల్లాయిగూడెం గ్రామ పంచాయతీ సిబ్బందికి అండగా పాలకవర్గం రూ. 19,000 ఆర్థిక సహాయం అందజేశారు. పుల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో పని చేస్తున్న సిబ్బంది జోగు పారిజాత గారి అత్తగారు జోగు లక్ష్మమ్మ భర్త ముత్తయ్య ఇటీవల మరణించడంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ తరపున రూ. 19,000 (పందొమ్మిది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్రముల రామలింగయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గారు వార్డు మెంబర్లు గ్రామపంచాయతీ సిబ్బంది మాట్లాడు తూ గ్రామంలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సమానమని కష్టకాలంలో వారిని ఆదుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.