అవంతి రీసెర్చ్ అండ్ టెక్నాలాజికల్ అకాడమీలో జాతీయస్థాయి 2కె26 టెక్నికల్ ఫెస్ట్.

సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ (భాగం స్వాతి సుధాకర్) ఫిబ్రవరి 13: అవంతి రీసెర్చ్ అండ్ టెక్నాలాజికల్ అకాడమీలో రెండు రోజులు పాటు జాతీయస్థాయి 2కె26 టెక్ ఫెస్ట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవంతి కళాశాల వ్యవస్థాపక చైర్మన్ మరియు మాజీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మేధస్సుకు పదును పెట్టి ఆహా అనిపించే,ఆవిష్కరణలు విద్యార్థులు కళాశాలల నుంచే సృజనాత్మకత,ఆధునిక సాంకేతికత వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకాలి అన్నార.ముఖ్య అతిథులు డా. ప్రియాంక జనరల్ సెక్రటరీ అవంతి కళాశాలలు,డా.ప్రశాంత్ కుమార్ మోహంతి, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఉపకులపతి, డి.వి.ఎస్ కాశీ విశ్వనాథ్, డి‌ఆర్.డి.ఓ విశాఖపట్నం,బాలసుబ్రహ్మణ్యం,క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ,అమ్జర్, విశాఖపట్నం, సోదరి స్వాతి, బ్రహ్మకుమారీ విశాఖపట్నం, డా.కె.శ్రీ.కుమార్, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈ.సీ.ఈ, జే.ఎన్.టి.యూ జి.వి విజయనగరం, పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం, స్వామి వివేకా నందలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు అందరూ ముందుకు రావాలని పిలువునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, ఉద్యోగార్హతలను పెంచు కోవాలని,ఉద్యోగ వేటగాళ్ళు ల కాకుండా ఉద్యోగదారులుగా ఎదగాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *