అభివృద్ధికి మాట ఇచ్చాం చేసి చూపిస్తున్నాం

★మంత్రి సవితమ్మ ఆదేశాలతో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కూటమి నేతలు..★ --గోరంట్ల మండలంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తాం కూటమి నాయకులు.

జనం న్యూస్ ఫిబ్రవరి 12 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) : రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ఇవ్వనివి కూడా చేసి చూపిస్తున్నామని గోరంట్ల మండల నాయలుకు తెలిపారు . మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు గురువారం గోరంట్ల మండలం బూచెపల్లి, గుంతపల్లి, కరావులపల్లి గ్రామాల్లో నూతన బీటి, సీసీ రోడ్ల నిర్మాణానికి కూటమి నేతలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా మంత్రి సవితమ్మ పెనుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నామని, బూచెపల్లి వద్ద రూ.2 కోట్లు 50 లక్షలతో నూతన బీటి రోడ్డు, గుంతపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి గ్రామంలోకి రూ.10 లక్షల సీసీ రోడ్డు, కరావులపల్లి నుంచి కరావులపల్లి తాండా వరకు రూ.60 లక్షలతో బీటి రోడ్డు నిర్మాణాలకు నేడు భూమి పూజ చేసినట్లు తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి గోరంట్ల మండలం వ్యాప్తంగా ప్రతి గ్రామానికి నూతన రోడ్లు నిర్మించి, ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. గురువారం భూమి పూజ చేసిన రోడ్లను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.