సాక్షి ,డిజిటల్ న్యూస్, మరికల్, ఫిబ్రవరి 13, 2026,(రిపోర్టర్ ఇమామ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ఆత్మకూరు వెళ్లే రహదారిలో వెలసిన మద్యం దుకాణం వద్ద జాతరలో వెలిసిన మాదిరిగా సిట్టింగ్ లా గుడారాలు వెలిశాయి. సంబంధిత శాఖ ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై నేటికీ ఒక్కసారైనా పరిశీలించిన దాఖలాలు లేవని పలు ప్రజాసంఘాల నాయకులు మరికల్ మండల కేంద్రంలో వాపోతున్నారు. ఆత్మకూరు వెళ్లే రహదారిలో వెలిసిన మద్యం దుకాణం వద్ద అనుమతులు లేకుండా సిట్టింగ్లా గుడారాలు జాతరలో వెలసిన మాదిరిగా ఏర్పాటు చేసిన అధికారులు కూడా పరిశీలించిన దాఖలాలు లేవని పలువురు వాపోతున్నారు. జిల్లాస్థాయి ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి ఆత్మకూరు వెళ్లే రహదారిలో వెలసిన సిట్టింగ్ల గుడారాలపై చర్యలు తీసుకోవాలని పలు ప్రజాసంఘాల నాయకులు పలువురు కోరుతున్నారు.
