సాక్షి డిజిటల్ న్యూస్, అనంతపురం ఫిబ్రవరి 13, అనంతపురం జిల్లా ఇన్చార్జ్, అనంతపురం జిల్లా పరిధిలో అఖిలభారత కార్మికుల సారధికా సమ్మె కార్యక్రమములో భాగంగా యన్. జి. ఓ. సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమములో జరిగిన ర్యాలీ నందు యన్. ఎచ్. యం జేఏసీ అధ్యక్షుడు కామ్రేడ్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో యన్. ఎచ్. యం. జాయింట్ యాక్షన్ కమిటీ (జె. ఏ. సి.) అనంతపురం జిల్లా తరుపున పాల్గొనివారి డిమాండ్స్ ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. 1) యన్. ఎచ్. యం. ఉద్యోగులకు నష్ట దాయకమైన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి. 2) యన్. ఎచ్. యం. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 3) యన్. ఎచ్. యం. ఉద్యోగులకు ఎచ్. ఆర్.పాలసీ అమలు చేయాలి. 4) యన్. ఎచ్. యం. ఉద్యోగులకు ఎచ్. ఆర్. పాలసీ లొ ఉన్న విధంగా వార్షిక ఇంక్రిమెంట్ ను అమలు చేయాలి. 5) యన్. ఎచ్. యం. ఉద్యోగులకు మ్యూచువల్ మరియు ఐచ్చిక బదిలీలకు అవకాశం అల్పించాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ కార్యక్రమములో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, ట్రెసరర్ జయవర్ధన రెడ్డి ఉద్యోగులు మహేష్, శ్రీనివాసులు, ఖాదర్, సూర్యనారాయణ, సుమన్, నాగరాజు, నారాయణ స్వామి, రాజేష్, ప్రశాంత్, జ్యోతి బోసు తదితరులు పాల్గొన్నారు.