అక్షరం తోనే అభ్యుదయం

★ఎంపీడీవో సువర్ణ రాజు

సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, అక్షరానికి ఉన్న విలువ వెలకట్టలేని సంపదని ఎంపీడీవో ఎం.విసువర్ణరాజు అన్నారు అక్షరాంద్ర కార్యక్రమంలో భాగంగా కాశీపురం గ్రామంలో డ్వాక్రా మహిళలతో గురువారం సమావేశం అయ్యారు ప్రతి మహిళ చదువు పట్ల అవగాహన కలిగి ఉండాల న్నారు నిరక్షరాస్యులుగా ఉన్నట్లయితే అన్ని విధాల మోసపోతామని తెలియజేశారు విద్య నేర్చుకుంటే కుటుంబాన్ని తీర్చి దిద్దుకునే అవకాశం ఉంటుందని ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ చదవడం రాయడం నేర్చుకోవాలని సూచించారు ప్రభుత్వం అందిస్తున్న డ్వాక్రా రుణాలను సద్వినియోగం పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు గ్రామాలు అభివృద్ధి చదువుతోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏ పి ఎం ప్రభాకర్ స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ వి పి వి త్రినాథ్ పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.