అంగన్వాడి కేంద్రంలో పలకలు పంపిణీ చేసిన ఏడవ వార్డు మెంబర్ మార్త వెంకన్న

సాక్షి డిజిటల్ న్యూస్ / ఫిబ్రవరి 13 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట అంగన్వాడి కేంద్రంలో గురువారం రోజున మానాయకుంట ఏడవ వార్డు మెంబర్ మార్త వెంకన్న పిల్లలకు పలకలు, బల్పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడి కేంద్రమే మొదట మెట్టన్నారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లల ప్రాథమిక అక్షరాస్యతను పెంపొందించేందుకు పలకలు, బలపాలు పంపిణీ చేశామన్నారు. తల్లిదండ్రులు మూడు సంవత్సరాల దాటిన పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రాలకు పంపించి ప్రభుత్వం ఇచ్చే పౌష్టి కారాహాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మానాయికుంట సర్పంచ్ దేశబోయిన నాగయ్య, మార్త లింగ మల్లు, మెడబోయిన శ్రీను, మార్త నాగరాజు, దేశ బోయిన మధు, సిబ్బంది సోమేశ్వర చారి, ఆయమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *