సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 3, వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు 12 ఫిబ్రవరి 2026 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ కేంద్ర , కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, విబిజి రాంజీ గ్రామీణ ఉపాధి హామీ నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, 106 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు విద్య మరియు వైద్యం నేడు ముప్పు వాటిల్లిందని కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడులను అమలుకు తెస్తున్నారు 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారు సామాజిక భద్రత పథకాలకు నిధులు తగ్గిస్తున్నది కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ను కట్టినంతరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు బిజెపి ప్రభుత్వం బరితెగించింది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులన్నిటిని తుంగలోకి తొక్కి ఉద్యోగులను గుర్తించకుండా వెట్టి చాకిరి చేసే విధంగా ప్రయత్నం సాగితుందన్నారు 4 లేబర్ కోడులను తిప్పి కొట్టి కార్మిక చట్టాలను కాపాడుకోవడం కార్మిక వర్గానికి చాలా అవసరం ఉందని తెలియజేశారు.ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈ.ఎస్.ఐ. మరియు పీ.ఎఫ్. సౌకర్యాలు ప్రభుత్వం నేరుగా ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.. నిన్న ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్లో కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ ఉందని పెట్టుబడుదారులకు కార్పొరేటు శక్తులకు అనుకూలంగా బడ్జెట్ ఉందని ఈ విధానాలకు వ్యతిరేకంగా 2026 ఫిబ్రవరి 12 వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పిలుపునిచ్చారు…