సోషల్ టాలెంట్ టెస్ట్ లో మొదటి, ద్వితీయ స్థానాల్లో మస్కాపూర్ విద్యార్థులు.

సాక్షి డిజిటల్ న్యూస్ తేది-04-02-2026. గ్రామం-మస్కాపూర్, మండలం-ఖానాపూర్, జిల్లా-నిర్మల్. రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మస్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి సోషల్ టాలెంట్ టెస్టులో ప్రథమ,ద్వితీయ స్థానాల్లో నిలిచారు. విద్యార్థులు ఎనగందుల జయంత్, నముండ్ల చరణ్ లను మంగళవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఇష్టపూర్వకంగా చదివి ఎదగాలన్నారు. జిల్లాస్థాయి స్థానాల్లో రాణించడం గర్వకారణం అని అన్నారు. గైడ్ టీచర్లు కుర్ర శేఖర్, రాపర్తి కిషన్ ప్రసాద్,మేకల చందన లను అభినందించారు. ఈ కార్యక్రమం లో బోనగిరి నరేందర్, తొంటి శంకర్, వెన్నంఅంజయ్య,షేక్ ఇమ్రాన్, దొమ్మాటశోభారాణి, గడప దీప్తి, మహ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.