పయనించే సూర్యుడు ఫిబ్రవరి 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: మండల కేంద్రంలో సీతారామ ప్రాజెక్టు మట్టి యధేచ్ఛగా ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతి లేకుండా అమ్మకాలు జరుపుతున్నారు. సామాన్యుడి ఇల్లు కట్టుకుంటే ఒక ట్రాక్టర్ మట్టి కావాలంటే ముప్పతిప్పలు పెట్టే అధికారులు.. సెలవు దినాల్లో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా సీతారామ ప్రాజెక్టు మట్టిని ట్రాక్టర్ల ద్వారా తోలకాలు జరుపుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏన్కూర్ మండలంలో అక్రమ మట్టి దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షించే అధికారులు అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతుంటే ఏం చేస్తున్నారంటూ స్థానికులు పరిశీలిస్తున్నారు. మట్టి వ్యాపారంతో లక్షలు దోచుకుంటున్న అక్రమ దందాకు తెరపడే పరిస్థితి లేదా అని స్థానికులకు అనుమానం వ్యక్తం అవుతుంది. రైతుల పొలాల్లో బఫర్ జోన్ కింద ఉంచిన మట్టిని రాత్రి, పగలు, అని తేడా లేకుండా అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతున్న, ఎవరికి పట్టినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు, సీతారామ మట్టి అక్రమ తవ్వకాలపై నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై సీతారామ ప్రాజెక్టు డి ఈ చంద్రశేఖర రావు, ను వివరణ కోరగా, అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతున్న విషయం తెలుసుకొని సంబంధిత ప్రాంతానికి వెళ్ళగా రెండు వాహనాలు ఉన్నాయని ఆ నెంబర్ల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.